Donald Trump సుంకాలపై భారత్తో అమెరికా లెక్క వేరు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి భారత్ (India) ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా, మెక్సికో, కెనడా (Canada) ల మాదిరిగా భారత్తో అమెరికా (America ) ప్రవర్తించకపోవచ్చని అవి వెల్లడిరచాయి. ఈ మేరకు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నాయి. భారత్తో తమకు సుంకాల సమస్య మాత్రమే ఉందని, వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలమని అమెరికా వాణిజ్యశాఖ చెందిన ప్రతినిధుల బృందం వెల్లడిరచినట్లు తెలిపింది.






