రష్యాకు అజీత్ దోవల్ … ఉక్రెయిన్ సంక్షోభంపై
జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిద్ దోవల్ వచ్చే వారం రష్యా వెళ్లనున్నారు. ఆ దేశ రాజధాని మాస్కోలో ఈ నెల 10-12 తేదీల మధ్య జరిగే బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ప్రధాని మోదీ ఇటీవల రష్యా, ఉక్రెయిన్లలో పర్యటించడం, ఉక్రెయిన్ సంక్షోభవానికి పరిష్కారం కొనుగొనే సత్తా భారత్‌కు ఉందన్న అభిప్రాయం ప్రపంచ నేతలు వ్యక్తం చేస్తున్న వేళ దోవల్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దోవల్ బ్రిక్స్‌లోని బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ఎన్ఎస్ఏలతో మాస్కోలో సమావేశం కానున్నారు. అదే సమయంలో రష్యా జాతీయ భద్రతా సలహాదారుతో ప్రత్యేకంగా సమావేశమై ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారంపై చర్చలు జరుపుతారని అధికార వర్గాలు తెలిపాయి.






