Zelensky : మా ప్రమేయం లేని ఒప్పందాలను అంగీకరించం : జెలెన్స్కీ
యుద్ధ విరమణపై తమ ప్రమేయం లేని ఎలాంటి చర్చలు తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) ప్రకటించారు. వాటిని తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ (Ukraine) – రష్యా(Russia) యుద్ధ విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన జెలెన్స్కీతోనూ చర్చలు జరిపారు. చర్చలకు చొరవ తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించాక, జెలెన్స్కీ దీనిపై తొలిసారిగా స్పందించారు. ప్రతీది పుతిన్ ప్రణాళిక ప్రకారం జరగడానికి వీల్లేదు. దీన్ని మేము అంగీకరించం, అనుమతించం అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా మా ప్రమేయం లేని ఎలాంటి చర్చలూ మాకు ఆమోదయోగ్యం కాదని మా మిత్రదేశాలకు స్పష్టం చేస్తున్నామని తెలిపారు.






