అమెరికాను అడ్డుకొనేందుకు .. సిద్ధం చేయండి
అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారుచేయాలని ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అడ్డుకొనేందుకు ఈ వ్యూహాన్ని అనుసరించాలని సూచించినట్లు తెలుస్తోంది. అమెరికాలో ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి కిమ్ మరింత దూకుడు పెంచారు. ఇటీవల తన అధికారులతో ఉత్తరకొరియా అధినేత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండిరచారు. మరోవైపు రష్యా`ఉక్రెయిన్ యుద్ధంలో కీమ్కు వాషింగ్టన్ సహకరించడాన్ని ఆయన విమర్శించారు. మాస్కోపై ఉక్రెయిన్ను పశ్చిమదేశాలు పావుగా వాడుకొంటున్నాయన్నారు. అమెరికా సైన్యం తన పలుకుబడిని పెంచుకోవడానికి ఈ యుద్ధాన్ని ఆయుధంగా మలచుకొందని ఆరోపించారు.






