North Korea :ఐదేళ్ల తర్వాత తొలిసారి.. విదేశీ పర్యటలకు అనుమతి!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) పర్యాటక రంగంపై దృష్టి సారించారు. పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు కిమ్ సర్కార్ సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లలో తొలిసారిగా విదేశీ పర్యటకులను కిమ్ సర్కార్ తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపాయి. కొన్ని వారాల క్రితం విదేశీయులు (Foreigners) ఉత్తర కొరియాలో పర్యటించారని, ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యాటక (Tourism) రంగాన్ని ప్రోత్సహించి విదేశీ మారక నిల్వలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. కిమ్ సర్కార్ నిర్ణయంతో యూకే(UK), కెనడా(Canada) , న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, చైనా వంటి దేశాల నుంచి అనేక మంది పర్యటకులు ఉత్తర కొరియా వచ్చేందుకు సిద్ధమవుతున్నారని కొరియా టూర్స్ జనరల్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు.






