New Zealand : న్యూజిలాండ్ గోల్డెన్ వీసా లో మార్పులు
సంపన్న వలసదారులను ఆకర్షించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు న్యూజిలాండ్(New Zealand) తన గోల్డెన్ వీసా(Golden Visa) కార్యక్రమాన్ని సరళీకృతం చేయనుంది. దీనిలో భాగంగా ఆంగ్ల భాష ఆవశ్యకతను తొలగించనుంది. ఏప్రిల్ 1 నుంచి యాక్టివ్ ఇన్వెస్టర్ ప్లస్ వీసాను కేవలం రెండు కేటగిరీలకు కుదించనున్నామని, ఆమోదయోగ్యమైన పెట్టుబడుల పరిమితిని విస్తరిస్తామని ఆ దేశ ఇమిగ్రేషన్ శాఖ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ (Erica Stanford) తెలిపారు. పెట్టుబడుల కోసం న్యూజిలాండ్‌ను గమ్యస్థానంగా ఎంచుకొనేలా పెట్టుబడుదారులను ప్రోత్సహించేందుకు ఇన్వెస్టర్ వీసా (Investor Visa )ను సులభతరం, మరింత సరళతరం చేస్తున్నామని ఆమె వివరించారు. గోల్డెన్ వీసాల దుర్వినియోగం ఆరోపణలతో అనేక దేశాలు ఈ వీసాలను రద్దు చేస్తున్న సమయంలో న్యూజిలాండ్ తన ఇన్వెస్టర్ వీసా నిబంధనలను సడలిస్తుండటం గమనార్హం.






