బ్రిటన్ నిర్ణయం సిగ్గుచేటు : నెతన్యాహు
ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమవుతుండటం, ఇటీవల ఆరుగురు బందీల మృతిపై అమెరికాతో పాటు అనేక దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు కొన్ని రకాల ఆయుధాల సరఫరాను నిలివేస్తున్నట్టు బ్రిటన్ పేర్కొంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బ్రిటన్ నిర్ణయం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. బ్రిటన్ తీసుకున్న ఈ నిర్ణయం హమాస్‌ను ఓడిరచాలనే మా సంకల్పాన్ని ఏమాత్రం మార్చదు. 14 మంది బ్రిటిష్ పౌరులతో పాటు 120 మంది ఇజ్రాయెల్ వాసులను పొట్టనబెట్టుకున్న చరిత్ర హమాస్‌ది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవకుండా, బ్రిటన్ తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం హమాస్ చర్యలను మరింత ప్రోత్సహిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.






