MS Dhoni: ఇంకెన్నాళ్ళు ఈ సాగాదీత ధోనీ..?
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని (Dhoni) వ్యవహార శైలిపై ఇప్పుడు అభిమానులు మండిపడుతున్నారు. ఆర్సిబి (RCB) తో జరిగిన మ్యాచ్ లో ధోని అనుసరించిన వైఖరి పై అభిమానులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. కీలక సమయంలో ధోని బ్యాటింగ్ కు రాకుండా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను బ్యాటింగ్ కు పంపడంపై అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
జట్టు గెలవాల్సిన సమయంలో ధోని అనవసరంగా రిస్క్ చేశాడని కొంతమంది అంటే.. ధోని ఆడటానికి శరీరం సహకరించనప్పుడు క్రికెట్ నుంచి తప్పుకుంటే మంచిదని మరికొంతమంది సూచిస్తున్నారు. అలాగే రన్ రేట్ తగ్గించాల్సిన సమయంలో డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నం చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. నెట్ రన్ రేట్ ప్రభావం జట్టుపై పడే అవకాశం ఉన్నా.. సరే ధోని నిదానంగా బ్యాటింగ్ చేశాడు. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.
ఇక నుంచి అయినా ధోని క్రికెట్ నుంచి తప్పుకుంటే మంచిది అని కోరుతున్నారు. ఐపీఎల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని.. ధోని ఇలాగే కొనసాగిస్తే అనవసరంగా అతని పరువు పోయే అవకాశాలుంటాయని అభిమానులు వేడుకుంటున్నారు. గెలవాల్సిన మ్యాచ్ లో కూడా చెన్నై చేతులెత్తేయడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 17 ఏళ్ల తర్వాత ఆర్సిబి.. చెన్నైలో విజయం సాధించింది. ఐపీఎల్ ఆరంభ సీజన్లో తొలి విజయాన్ని ఇక్కడ నమోదు చేసింది.
ఆ తర్వాత 17 ఏళ్లకు పలువురు కెప్టెన్లు మారిన తర్వాత విజయాన్ని అందుకుంది ఆర్ సి బి. అటు జట్టులోని కొంతమంది ఆటగాళ్లు తీరుపై కూడా విమర్శలు వచ్చాయి. దూకుడు కాడాల్సిన సమయంలో చెత్త షాట్ లు వాడి వికెట్ పారేసుకోవాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. భారీ స్కోర్ కాకపోయినా అనవసరంగా జట్టు ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.






