Narendra Modi: మే నెల్లో రష్యా పర్యటనకు ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి రష్యా (Russia)లో పర్యటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్కడ జరగనున్న గ్రేట్ పేట్రియాటిక్ వార్ (Great Patriotic War) 80వ వార్షికోత్సవ పరేడ్‌లో ఆయన పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. మే 9న మాస్కో (Moscow)లోని రెడ్ స్క్వేర్ వద్ద గ్రేట్ పేట్రియాటిక్ వార్ 80వ వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత సైనిక దళం సైతం కవాతు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై విదేశీ వ్యవహారాల శాఖ ఏ ప్రకటన చేయలేదు. ఈ పరేడ్‌కు వివిధ దేశాల అధినేతలను ఆహ్వానిస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు.






