150 ఏళ్ల తర్వాత అరుదైన సొరచేప దర్శనం
దాదాపు 150ఏళ్ల తర్వాత చిలియన్ ఏంజిల్ షార్క్ అనే అరుదైన సొరచేప చిలీ దేశ మత్సకారులకు చిక్కింది. దీంతో, శాస్త్రవేత్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ ఈ సొర గురించి పూర్తి సమచారం లభించక శాస్త్రవేత్తల్లో అసంతృప్తి ఉండేది. 1887లో చివరిసారిగా ఈ చేపను ఓ పరిశోధకుడు తీర ప్రాంతపు లోతు తక్కువ నీళ్లల్లో గుర్తించాడు. దాదాపు మూడు అడుగుల పొడవుండే ఈ సొర చేప సముద్రపు నీటి అడుగున ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రే చేప ఆకారంలో ఉండటం దీని ప్రత్యేకత అని చెబుతున్నారు. చాలా అరుదుగా మాత్రమే ఇది సముద్రాల్లో కనిపిచండంతో దీనిపై శాస్త్రవేత్తల వద్ద అంత సమాచారం లేదు. ఈ సొర అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా దొరికిన సొరల అధ్యయనంతో వీటి సంరక్షణకు మరిన్ని మెరుగైన చర్యలు చేపట్టొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.






