Suchata Opal: మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాత ప్రస్థానం..

మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ సుందరీమణి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ (Opal Suchata Chuangsri) ఎంపికయ్యారు. ఫైనల్ రౌండ్‌లో టాప్ 4 లో మార్టినిక్, పొలెండ్, థాయ్‌లాండ్, ఇథియోపియో అందెగత్తెలు నిలిచారు. వీరిలో అత్యుత్తమ సమాధానంతో సుచాత కిరీటాన్ని సొంతం చేసుకుంది.
ఫైనల్ రౌండ్ లో కు వచ్చిన అందగత్తెలను జడ్జిలు ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎవరు అత్యుత్తమంగా ఆన్సర్ చెబితే వారే విజేతగా నిలుస్తారు. ఇదే థాయ్ లాండ్ (Thailand) సుందరి ఓపల్ సుచాతను కూడా విజేతగా నిలబెట్టింది. ఫైనల్ రౌండ్ కు రానా, సోనూసూద్ తో పాటూ మరికొందరు వచ్చారు. ఇందులో సోనూసూద్ ఈ జర్నీ మీకు ఏం నేర్పించింది అని ఓపల్ ను అడిగారు. దానికి ఆమె నా జీవితంలో ఇది నాకు దొరికిన గొప్ప అవకాశం. మిస్ వరల్డ్ అనేది ఒక గొప్ప బాధ్యత, ఎప్పుడైనా మనం చేసే పనులు మంచివై ఉండాలి. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నా..మన పిల్లలు, చుట్టూ ఉన్నవాళ్లు లేదా పేరెంట్స్..ఇలా ఎవరైనా మనల్ని చూస్తున్నారు అనేది ముఖ్యం అని ఆమె సమాధానం చెప్పారు. దీనికి జడ్జిలు ఫిదా అయిపోయారు. మిస్ట్ వరల్డ్ టైటిల్ కు ఆమెను ఎంపిక చేశారు.
తన విజయ రహస్యాన్ని వివరిస్తూ, “ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు నమ్మండి. మీ మౌలిక విలువలకు కట్టుబడి ఉండండి. నా లక్ష్యాన్ని పట్టుకుని, నన్ను నేను నమ్ముకున్నందువల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ ప్రయాణంలో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కూడా మర్చిపోవద్దు” అని సుచాత మీడియాకు వివరించారు. “ఇది ఎప్పుడూ సులువు కాదు, కొన్నిసార్లు అలసటగా, నిరుత్సాహంగా అనిపించవచ్చు. కానీ మీరు ఎప్పుడూ వదిలిపెట్టకపోతే మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అక్కడికి తప్పకుండా చేరుకుంటారు” అని ఆమె తెలిపారు.
ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్న ఒపల్ సుచాత, ఏదో ఒకరోజు రాయబారి (అంబాసిడర్) కావాలని అనుకుంటున్నారని మిస్ వరల్డ్ వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. అలాగే, సైకాలజీ, ఆంత్రోపాలజీపై ఆమెకు మక్కువ.బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్న సంస్థలతో ఆమె కలిసి పనిచేశారు.ఒపల్ 16 పిల్లులు, 5 కుక్కలను పెంచుకుంటున్నారు.
మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్‌గా ఇథియోపియా భామ హాసెట్ డెరెజే, రెండో రన్నరప్‌గా మిస్ పోలండ్ మయా క్లైడా, మూడో రన్నరప్‌గా మార్టినిక్ భామ ఆరేలి జోచిమ్ నిలిచారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన ఫైనల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా…సుచాతకు కిరీటాన్ని అలంకరించారు. సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. 21 ఏళ్ల సుచాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టూడెంట్, మోడల్. థాయ్ లాండ్ నుంచి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అందగత్తెగా ఓపల్ నిలిచారు.