Vikaswamy : వికాస్స్వామి ప్రపంచ రికార్డ్… దంతాలతో
ఇటలీలోని ప్రముఖ నగరం మిలాన్‌లో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record ) పోటీల్లో దంతాలతో 125 కిలలో బరువు ఎత్తి మీరట్‌కు చెందిన వికాస్స్వామి(Vikaswamy) ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. ఫిబ్రవరి 14న మిలాన్ (Milan)లో జరిగిన పోటీల్లో స్వామి తన పంటి బలంతో 125 కిలోల బరువును 35.57 సెకండ్ల పాటు ఎత్తారు. తద్వారా సరికొత్త ప్రపంచ రికార్డ్ (World record) నెలకొల్పినట్టు తాజాగా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మిలాన్ పోటీల్లో పాల్గొని ఇంటికి చేరుకున్న అతడికి స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు లభించలేదని ఆయన వాపోయారు.






