ఆ దేశం నుంచి భారత విద్యార్థులు బహిష్కరణ!
కెనడా ప్రభుత్వ విధానాలతో అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రికి రాత్రే ఇమిగ్రేషన్ పాలసీల్లో మార్పులు చేసి, వర్క్ పర్మిట్లను నిరాకరించడంతో వందల మంది విద్యార్థులు ఇప్పుడు ఆ దేశం నుంచి బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ రీజియన్లో ఆందోళనకు దిగారు. తమను దేశంలో ఉండేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినా, వర్క్ పర్మిట్లు ఇవ్వడం లేదని, దీంతో కెనడా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






