Mauritius: మా నుంచి మారిషస్‌కు గిఫ్ట్ ఇదే : మోదీ
మారిషస్ తమకు కీలక భాగస్వామి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరపున మారిషస్ ప్రజలకు నేషనల్ డే (National Day) శుభాకాంక్షలు తెలియజేశారు. నేషనల్ డే రోజున మరోసారి మీముందు ఉండటం నా అదృష్టం. మన రెండు దేశాలను అనుసంధానించేది హిందూ మహాసముద్రం(Indian Ocean) మాత్రమే కాదు. సంస్కవృతి, సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతున్నాయి. ఈ రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని ప్రధాని నవీన్ చంద్ర రామ్గులాం(Naveen Chandra Ramgulam), నేను నిర్ణయించాం. మారిషస్‌లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్(India) సహకరించనుంది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్‌కు ఇదొక కానుకగా భావిస్తున్నాం అని మోదీ అన్నారు.






