ఆ దేశంలో 30 మంది అధికారులకు మరణశిక్ష!
ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ నియంతృత్వ పాలనలో కఠినమైన ఆంక్షలతో పాటు చిన్నచిన్న తప్పిదాలకు ఘోరమైన శిక్షలు విధిస్తూ ఉంటారు. ఆ దేశం భారీవర్షాలు, వరదలతో ఇటీవల అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠినచర్యలకు కిమ్ సిద్ధపడ్డాడరు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిసింది. జులై`ఆగస్టు మధ్య ఉత్తర కొరియాలో భారీ వర్షాలు కురిశాయి. వరదల్లో కొన్ని ఊళ్లు కొట్టుకుపోయాయి. దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. వరదల సమయంలో కిమ్ స్వయంగా రంగంలోకి దిగి విపత్తు ప్రదేశాల్లో పర్యటించారు. మోకాలిలోతు నీటిలో కిమ్ కారు డ్రైవ్ చేసుకొంటూ వెళ్లడం బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు.






