KERALA : కేరళ నర్స్‌కు జాక్‌పాట్ … లాటరీలో
యూఏఈలో కేరళ నర్స్ మను మోహనన్ (Manu Mohanan )కు జాక్‌పాట్ తగలింది. లాటరీలో ఆయన రూ.70 కోట్లు గెలుచుకున్నారు. లైవ్ టీవీ షోలో జరిగిన బిగ్ టికెట్(Big Ticket) రాఫెల్ డ్రాలో హోస్ట్ ఆయను పిలిచి, మీరు 3 కోట్ల దిర్హామ్స్ విజేత అని చెప్పారు. మోహనన్ షాక్‌కి గురై, నిజమేనా? అని మూడుసార్లు టికెట్ నంబరును చెప్పించుకున్నారు. రెండు టికెట్లు కొంటే ఒకటి ఉచితం స్కీమ్‌లో ఆయన ఈ టికెట్‌ను గత నెలలో కొన్నారు. మోహనన్ మాట్లాడుతూ తాను, తన స్నేహితులు ఐదేళ్ల నుంచి లాటరీలో బహుమతి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తాను ఏడేళ్ల నుంచి బహ్రెయిన్ (Bahrain)లో నర్స్ (Nurse )గా పని చేస్తున్నానని తెలిపారు.






