Trudeau :కెనడా ఆర్థిక వ్యవస్థను కూల్చడమే ట్రంప్ లక్ష్యం : ట్రూడో
కెనడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకే తమపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను విధించారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ను సంతోషపెట్టడమే ఆయన లక్ష్యమన్నారు. త్వరలో ప్రధాని పదవి నుంచి దిగిపోనున్న ట్రూడో సుంకాల యుద్ధంపై మీడియాతో మాట్లాడారు. కెనడాపై అమెరికా (America) వాణిజ్య యుద్దాన్ని ప్రారంభించింది. వారి సన్నిహిత భాగస్వాములతో సానుకూలంగా వ్యవహరించేందుకే ట్రంప్ (Trump) చర్యలు తీసుకున్నారు. పుతిన్‌ను సంతోషపెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాలో కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చకోవాలనే కుట్రలో భాగంగానే ఇది వచ్చింది. కానీ అది ఎప్పటికీ జరగదు. నేను ట్రంప్‌తో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను. ఫెంటానిల్ డ్రగ్‌పై ఆయన చేసే వాదనలు అబద్ధం. ఆయన నిర్ణయం ఇరు దేశాల ప్రజలను బాధపెడుతోంది అని ట్రూడో పేర్కొన్నారు.






