ఆస్ట్రేలియా చేరుకున్న అసాంజే
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఎట్టకేలకు తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. బ్రిటన్ నుంచి అమెరాకా ఆధీనంలోని ఉత్తర మారియానా ద్వీపానికి చేరుకున్న ఆయన అక్కడి ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. అమెరికా సైనిక రహస్యాలను బహిరంగ పరిచిన కేసులో నేరాన్ని అంగీకరించారు. దీంతో ఎన్నో ఏళ్లుగా సాగుతున్న కేసుకు అనూహ్య ముగింపు లభించింది. దీంతో 52 ఏళ్ల అసాంజేకు ఊరట లభించింది. స్వదేశానికి వెళ్లేందుకు అమెరికా అంగీకరించడంతో ఆయన ఆస్ట్రేలియా చేరుకున్నారు. కాన్ బెర్రా విమానావ్రయంలో ఆయనకు తండ్రి జాన్ షిప్టన్ స్వాగతం పలికారు. అసాంజే భార్య ఆయనతోనే బ్రిటన్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చారు.






