యూఎస్ ఓపెన్.. ప్రపంచ నంబర్ వన్‌కు షాక్
ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ స్లామ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెం-1 ఇగా స్వియెటెక్కు షాక్ తగిలింది. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ జెస్సికా పెగులా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలై టోర్నీ నుంచి వైదొలిగింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెం.1, పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ 2`6, 4`6 తేడాతో స్థానిక క్రీడాకారిని 6వ సీడ్ జెస్సిక పెగులా (అమెరికా) చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన స్వియాటెల్ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. జెస్సికా మాత్రం సంచలన విజయంతో ట్రోఫీకి మరింత చేరువైంది.






