Jeff Bezos : రోదసి యాత్రకు జెఫ్ బెజోస్ ప్రియురాలు
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ (Jeff Bezos) కు చెందిన సంస్థ బ్లూ ఆరిజిన్ చేపడుతున్నన రోదసీ యాత్రలో ఆయన ప్రియురాలు కాబోయే బార్య లారెన్ శాంచెజ్ (Lauren Sanchez) భాగమయ్యారు. ఎన్ఎస్-31 మిషన్ పేరుతో పూర్తిగా మహిళా సభ్యులతో చేపట్టే రోదసీ యాత్రలో ఆమె కూడా పర్యటించనున్నారు. ఆమెతో పాటు పాప్ సింగర్ కేటీ పెర్రీ (Katy Perry), సీబీసీ న్యూస్ యాంకర్ గైలీ కింగ్, పౌర హక్కుల కార్యకర్త అమందా గుయెన్ (Amanda Nguyen), సినీ నిర్మాత కెరియన్ ఫ్లెన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐసా బోవె న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో రోదసీ ప్రయాణం చేయనున్నారు. మార్చి-జూన్ మధ్యలో ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.






