యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఫ్రిట్జ్‌పై సిన్నర్ విజయం
ఇటలీ యువ సంచలనం జన్నిక్ సిన్నర్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విన్నర్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గి సంచలనం స్పష్టించిన సిన్నర్, తాజాగా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌నూ సొంతం చేసుకున్నాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన యూఎస్ ఓపెన్ మెన్స్, సింగిల్స్ ఫైనల్లో సిన్నర్ 6-3, 6-4, 7-5తో అమెరికా కుర్రాడు టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించాడు. రెండు గంటలా 16 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో వరుస సెట్లలో ఫ్రిట్జ్‌ను చిత్తుచేసిన సిన్నర్ నోవాకో జొకోవిచ్, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ తర్వాత ఒకే ఏడాది హార్డ్ కోర్ట్స్ ( ఆస్ట్రేలియా, యూఎస్)లో టైటిల్ గెలిచి నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.






