భారత్, చైనా విదేశాంగ మంత్రుల చర్చలు
తూర్పు లద్దాఖ్‌లో దెస్సాంగ్, దెమ్ చోక్ ప్రాంతాల నుంచి సైనిక దళాలు వెనుదిరగడంతో తదుపరి కార్యచరణ గురించి భారత్, చైనాల విదేశాంగ మంత్రులు సోమవారం జీ 20 శిఖరాగ్ర సదస్సు వేదికగా చర్చించారు. బ్రెజిల్ లోని రియో డి జనీర్లో జరిగిన సదస్సులో భారత విదేశీ వ్యవహారాశాఖ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ సంప్రదింపులు జరిపారు. మరోవైపు, భారత్, చైనాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొని వచ్చే ఏడాదికి 75 ఏళ్లవుతాయి. ఈ సందర్భంగా ఉత్సవాలు, సమావేశాలు జరగాలని వాంగ్‌యీ ఈ సందర్భంగా సూచించారు. మరోవైపు భారత్`చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పున ప్రారంభించే అంశంపై రెండు దేశాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు కైలాస మానసరోవరం యాత్ర పున ప్రారంభం అంశమూ చర్చకు వచ్చినట్లు సమాచారం.






