మేం మా లక్ష్యాలను సాధించేవరకు దాడులు ఆపం : నెతన్యాహు
ఇజ్రాయెల్, హెజ్బొల్లా ఘర్షణను ఆపేందుకు అమెరికా, ఫ్రాన్స్, ఇతర దేశాలు చేసిన 21 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. తమ లక్ష్యాలను సాధించేవరకు హెజ్బొల్లాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లెబనాన్‌పై పూర్తిశక్తితో విరుచుకుపడాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇజ్రాయెల్ విధానం సుస్పష్టం. మేం మా లక్ష్యాలను సాధించేవరకు దాడులు ఆపం. హెజ్బొల్లా దాడుల కారణంగా ఉత్తర ఇజ్రాయెల్‌ను ఖాళీ చేసిన పౌరులు తమ నివాసాలకు తిరిగి వెళ్లడం మాకు కీలకం అని నెతన్యాహు తెలిపారు.






