Iran: రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి మేము సిద్ధం .. ఇరాన్ కీలక ప్రకటన
పహల్గామ్ ఉగ్రదాద దాడి నేపథ్యంలో భారత్(India), పాకిస్తాన్ (Pakistan) మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు పాకిస్తాన్ వెళ్లకుండా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే దాని ఉపనదులపై ఉన్న డ్యాముల గేట్లను క్లోజ్ చేసింది. మరోవైపు, పాకిస్తాన్ భారత్ తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇందులో సిమ్లా ఒప్పందం (Simla Agreement) కూడా ఉంది. భారతీయ విమానాలకు పాక్ తన గగనతలాన్ని మూసేసింది. అయితే ఈ ఉద్రికత్తల నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి తము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ (Iran) ముందుకొచ్చింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం ప్రాధాన్యతను నొక్కి చెబుతూ, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి (Abbas Araghchi) భారత్, పాకిస్తాన్లను పొరుగు సోదరులుగా అభివర్ణించారు.







