MS Dhoni: ధోని హిట్టింగ్ కష్టమేనా..?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని(MS Dhoni) ఐపిఎల్ నుంచి తప్పుకోవడం మంచిదా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన ధోని.. ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్నాడు. గత ఏడాది అతను రిటైర్ అవుతాడని అందరూ భావించారు. అతను క్రికెట్ నుంచి తప్పుకుంటాడని.. ఈ ఏడాది కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి. కానీ ధోని మాత్రం ఐపీఎల్(IPL) నుంచి తప్పుకునెందుకు ఆసక్తి చూపడం లేదు.
చెన్నై జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన ధోని పై చెన్నై అభిమానుల్లో గౌరవం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో అతని ఆట తీరు చూస్తున్న.. అభిమానులు ధోని తప్పుకోవడం మంచిది అనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో గెలిచే అవకాశం ఉన్న సరే ధోని దూకుడుగా ఆడలేకపోయాడు. సందీప్ శర్మ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. అటు మిగిలిన ఆటగాళ్లు కూడా పెద్దగా రాణించలేకపోయారనే చెప్పాలి.
ధోనిలో కీపింగ్ టాలెంట్ అలాగే ఉన్నా బ్యాటింగ్ లో మాత్రం అతను నిలబడలేకపోతున్నాడు. కేవలం సింగిల్స్ కు మాత్రమే ప్రాధాన్యతిస్తున్నాడు. భారీ షాట్ లు ఆడ లేకపోతున్నాడనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. దానికి తోడు గతంలో ఉన్న ఫిట్నెస్ కూడా ధోనిలో కనబడటం లేదు. దీనితో కచ్చితంగా అతను తప్పుకుంటే మంచిదనే అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ఉన్న గౌరవం అనవసరంగా పోగొట్టుకుంటాడని అభిమానులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ధోని టార్గెట్ గా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక చెన్నై అభిమానులు కూడా మ్యాచ్ చూసిన అనంతరం న్యూస్ చానల్స్ తో లేదంటే యూట్యూబ్ ఛానల్స్ తో మాట్లాడుతూ విమర్శలు చేస్తున్నారు. కీలక సమయంలో బ్యాటింగ్ కు రావాల్సిన ధోని ఇతర ఆటగాళ్లను పంపించడంపై కూడా విమర్శలు ఉన్నాయి.






