Indigo: అమెరికాలోని మరో 4 నగరాలకు ఇండిగో సేవలు

తుర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో కోడ్‌షేర్ భాగస్వామ్యం ద్వారా అమెరికా (America )లోని మరో నాలుగు నగరాలకు సేవలు విస్తరిస్తున్నట్లు ఇండిగో (Indigo) తెలిపింది. డిసెంబర్ 18 నుంచి ఇస్తాంబుల్ (Istanbul) మార్గంలో హ్యూస్టన్, అట్లాంటా, మియామి, లాస్ ఏంజెలెస్ వెళ్లే తమ ప్రయాణికులు నేరుగా టికెట్లు కొనుగోలు పేర్కొంది. న్యూయార్క్, వాషింగ్టన్, బోస్టన్, షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాలకు కూడా కోడ్‌షేరింగ్ ద్వారా ఇండిగో విమాన సేవలు అందిస్తోంది.