భారతీయుడికి జీవిత ఖైదు
భార్య హత్య కేసులో ఓ భారతీయుడికి లండన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. గతేడాది జరిగిన ఈ ఘటనలో తాజాగా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భారత్‌కు చెందిన సాహిల్ శర్మ(24) మెహక్ (19)కు గతేడాది వివాహం జరిగింది. వివాహం అనంతరం దంపతులు లండన్‌లోని క్రోయిడాన్లో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే సాహిల్ తన భార్యను కత్తితో దారుణంగా హత్య చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్య చేసిన సాహిల్ పోలీసులకు సమాచారం అందించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న మెహక్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో న్యాయస్థానం ఎదుట తన భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించారు. అయితే ఈ నేరానికి పాల్పడడానికి గల కారణాలను వెల్లడిరచలేదు. ఈ కేసులో లండన్ కోర్టు విచారణ చేపట్టి తాజాగా తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సాహిల్‌కు జీవిత ఖైదును విధించింది. ఒకవేళ అతడు పెరోల్ పొందాలనుకుంటే ఆయన కనీసం 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది.






