Thailand : థాయ్‌లాండ్‌లో భూకంపం.. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ (Bangkok)సహా పలు చోట్ల భారీ భూకంపం సంభవించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ఏ భారతీయ పౌరుడికీ అవాంఛనీయ ఘటన తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని స్పష్టం చేసిన ఎంబసీ, ఇండియన్ల (Indians) కు హెల్ప్‌లైన్ నంబరు ఏర్పాటు చేసింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే థాయ్‌లాండ్‌లోని భారతీయులు ఎమర్జెన్సీ నంబరు +66 618819218ను సంప్రదించాలని సూచించింది. బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, చియాంగ్ మాయీ (Chiang Mai) నగరంలోని కాన్సులేట్ సభ్యులంతా సురక్షితంగా ఉన్నట్లు పేర్కొంది.






