Kshama Sawant :క్షమా సావంత్ వీసా తిరస్కరణ
అమెరికాలోని సియాటిల్ (Seattle)లో ఉన్న భారత కాన్సులేట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్ (Kshama Sawant )కు అత్యవసర వీసా (VISA) నిరాకరించడంతో ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తిందని భారత కాన్సులేట్ (Indian Consulate) వర్గాలు వెల్లడిరచాయి. కార్యాలయ సమయం ముగిసిన తర్వాత కొందరు వ్యక్తులు కాన్సులేట్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వెళ్లిపోవాలని అనేకసార్లు సూచించినప్పటికీ, వారు నిరాకరించారు. అంతేకాకుండా కాన్సులేట్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతోపాటు బెదిరింపులకు దిగారు అని సియాటిల్‌లోని భారత కాన్సులేట్ పేర్కొంది.






