IND vs PAK: పాక్ తో మ్యాచ్ మిస్టరీ స్పిన్నర్…?
పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి. రెండు దేశాల అభిమానుల భావోద్వేగాలకు సంబంధించిన మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ పై హడావుడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ స్టేజ్ లో జరగబోయే రెండో మ్యాచ్ లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ విషయంలో.. భారత్ పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)ని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.
మొదటి మ్యాచ్ లో అతనిని పక్కన పెట్టినా.. రెండో మ్యాచ్ లో అతను కీలకం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే అతనిని తుది జట్టులోకి తీసుకుంటే మంచిదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఇంగ్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ తో పాటుగా వన్డే సిరీస్ లో కూడా అతను ప్రభావం చూపించాడు. ఏకంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో అతను 14 వికెట్లు పడగొట్టాడు. దీనితో అతన్ని ఖచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
ఇక దీనిపై కోచ్ గౌతమ్ గంభీర్మ్, కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma) కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అతను వస్తే బౌలింగ్ విభాగం ఇంకా బలపడే అవకాశాలుంటాయి. అయితే ఎవరిని జట్టులో నుంచి తప్పిస్తారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ అర్షదీప్ సింగ్ ను కూడా తుది జట్టులోకి తీసుకోవాలని.. గత కొన్ని రోజులుగా డిమాండ్లు వినపడుతున్నాయి. అతను కేవలం టి20లకు మాత్రమే పరిమితం చేయడం కరెక్ట్ కాదని.. భారత్ ప్రస్తుతం లెఫ్ట్ హ్యాండ్ పేసర్ లోటును ఎదుర్కొంటుందని.. ఖచ్చితంగా ఆ లోటును అర్షదీప్ సింగ్ తీర్చే అవకాశం ఉంటుందని కాబట్టి అతనికి వన్డేల్లో అవకాశం కల్పించాలని కోరుతున్నారు ఫ్యాన్స్.
జస్ప్రిత్ బూమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి పాకిస్తాన్తో మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అటు పాకిస్తాన్ కూడా మొదటి మ్యాచ్ ఓటమితో రెండో మ్యాచ్ పై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ మ్యాచ్ లో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే భారత్ అలెర్ట్ అవుతోంది.






