Myanmar : మరోసారి భారత్ సాయం.. మయన్మార్‌కు
భారీ భూకంపాలతో మయన్మార్ (Myanmar) , థాయ్‌లాండ్ (Thailand ) లు వణికిపోతున్నాయి. అక్కడి ప్రజల జీవనవిధానం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు మయన్మార్‌లో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న ఆ దేశానికి సాయం చేసేందుకు మరోసారి భారత్ (India) ముందుకొచ్చింది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బందిని అక్కడికి పంపనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు వెల్లడిరచారు. మయన్మార్ కు సాయం అందించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ విషయంపై సమావేశమై చర్చించాం. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.






