India: పాక్‌పై ఆపరేషన్ సింధూర్…
పహల్గాం దాడికి బదులు తీర్చుకుంటామని హెచ్చరించిన భారత్.. పాక్‌పై భీకర దాడుల ప్రారంభించింది. ఈ దాడిలో జీవిత భాగస్వాములను కోల్పోయిన మహిళల కన్నీరు తుడిచేలా ఆపరేషన్ సింధూర్ (operation sindhoor) పేరిట పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు భీకర దాడులు ప్రారంభించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాక్‌లోని మూడు పలు ఉగ్రవాద శిబిరాలను భారత మిసైళ్ల వర్షం కురిపిస్తోంది.
లష్కరే తయ్యబా, జైష్ ఏ మహ్మద్, హిజ్బలు ముజాహిద్దీన్, ఇతర ఉగ్రసంస్థల స్థావరాలు టెర్రర్ నెట్‌వర్క్‌లు ధ్వంసం చేయడమే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మెరుపుదాడులకు దిగింది. బహావల్పూర్, మురిద్కే, కోట్లీ, గుల్పూర్, సవాయ్, సర్జాల్, బర్నాలా, మెహ్మూనా ప్రాంతాలపై దాడి దాడులకు దిగింది మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు భారత సైన్యం వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత చెప్తున్నారు.







