రష్యా పర్యటనకు ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ జులైలో రష్యాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. భారత్-రష్యా మధ్య వార్షిక చర్చల నిమిత్తం ఈ పర్యటన జరగనుంది. రష్యాలో విజిట్ చేసేందుకు మోదీని ఓపెన్ ఇన్విటేషన్ ఉన్నట్లు ఇటీవల క్రెమ్లిన్ పేర్కొన్న విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మోదీ కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. మాస్కోలో పుతిన్‌ను మోదీ కలుస్తారని తెలుస్తోంది. అయితే వీరి భేటీకి చెందిన కచ్చితమైన తేదీని ఇంకా వెల్లడిరచలేదు. కానీ జులై 8వ తేదీన ఈ భేటీ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పుతిన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి యూరి ఉషోకోవ్ మాత్రం దీనిపై ఇంకా ప్రకటన చేయలేదు. ఈ ఏడాది బ్రిక్స్ నేతల సమావేశాల్లోనూ ఇద్దరూ కలుసుకోనున్నట్లు భావిస్తున్నారు. కచన్ నగరంలో ఈ సమ్మిట్ జరగనున్నది. గత ఏడాది డిసెంబర్లో విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటించారు. ఈ సమయంలో మోదీకి పుతిన్ ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది.






