America : అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు : కేంద్రం
అమెరికాపై సుంకాల తగ్గింపునకు ఎలాంటి హామీ ఇవ్వలేదని భారత (Indian) ప్రభుత్వం స్పష్టం చేసింది. సుంకాల తగ్గింపు అంశంపై అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు పదే పదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబరు (September) వరకు సమయం కోరాం అని పార్లమెంటరీ ప్యానెల్ (Parliamentary panel ) కు ప్రభుత్వం వెల్లడిరచింది. భారత్, అమెరికా పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా కృషి చేస్తున్నాయని, వెంటనే సుంకాలు సర్దుబాటు చేసుకునే బదులు దీర్ఘకాలిక వాణిజ్య సహకారంపై దృష్టి సారించాయని వాణిజ్యశాఖ కార్యదర్శి వెల్లడిరచారు.






