కెనడాకు భారత్ కౌంటర్
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య జరిగిన ఏడాదైన సందర్భంగా కెనడా పార్లమెంట్లో సంతాప కార్యక్రమం జరిగింది. ఈ సంతాప కార్యక్రమం పట్ల భారత్ నిరసన వ్యక్తం చేసింది. ఉగ్రవాద సమస్యను ఎదుర్కోవడంలో భారత్ ముందు వరుసలో ఉంది. ఈ విషయంలో ఇతర దేశాలతో కలిసి పనిచేస్తోంది. ఎయిరిండియా కనిష్క విమానాన్ని గాల్లో పేల్చేసి 23 జాన్‌కి 39 ఏళ్లయింది. ఆ ఉగ్రవాదుల పిరికి పంద చర్యకు 329 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో 86 మంది చిన్నారులు ఉన్నారు. పౌరవిమాన యాన చరిత్రలో ఇది ఘోర దుర్ఘటన. ఆ రోజున వాంకోవర్‌లోని స్టాన్లీ పార్కు వద్ద సెపెర్లీ ప్లే గ్రౌండ్‌లోని ఎయిరిండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఫీుభావం తెలిపేందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రవాస భారతీయుల్ని కోరుతున్నాం అని దౌత్య కార్యాలయం తెలిపింది.






