India Diplomatic Mission: ఆపరేషన్ సిందూర్ ముగిసింది.. భారత్ దౌత్యయాత్ర మొదలైంది

పాకిస్తాన్ మరోసారి భారత్ వైపు, కశ్మీర్ వైపు చూడడానికి వీల్లేదు. చూడాలంటేనే భయపడాలి.. ఉగ్రవాదాన్ని ఇక సహించేది లేదు. మంచిగా ఉంటే సరి.. లేదంటే.. అంతకు అంతా చేస్తాం. ఇదీ మోడీ నేతృత్వంలోని భారతదేశం అనుసరిస్తున్న విధానం. ఏ లెక్కకు ఆలెక్కే.. పాక్ పొరుగు నుంచి ఉగ్రదాడికి ప్రయత్నాలు చేసింది. దీనికి భారత్ సిందూర్ రూపంలో గట్టి జవాబిచ్చింది. దీంతో దాయాదికి దిమ్మ దిరిగింది. రక్షణపరంగా చాలా నష్టం వాటిల్లింది. ఇప్పుడు యుద్ధంలో ఏం చేయలేమన్న విషయం అర్థమైన పాక్… దౌత్యపరంగా దాడికి ప్రయత్నాలు చేస్తోంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తన వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేసేందుకు ప్రత్యేక గ్లోబల్ అవుట్‌రీచ్ (India Diplomatic Mission) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత పార్లమెంటు నుంచి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సభ్యులు ఉన్న ఏడు బృందాలు ప్రపంచంలోని దాదాపు 33 దేశాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలతో పాటు ఇతర ప్రాధాన్యత గల దేశాలకు కూడా భారత ఉగ్రవాద వ్యతిరేక వైఖరి గురించి వివరించనున్నాయి.
మంగళవారం జరిగిన బ్రీఫింగ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ 33 దేశాల ఎంపికపై క్లారిటీ ఇచ్చారు.ఈ జాబితాలో దాదాపు 15 దేశాలు భద్రతా మండలి (UNSC) సభ్య దేశాలు కాగా, మరో ఐదు దేశాలు భవిష్యత్తులో UNSC సభ్యదేశాలుగా ఉండబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, అంతర్జాతీయంగా మంచి ప్రభావం కలిగిన కొన్ని ఇతర దేశాలు కూడా ఇందులో భాగమయ్యాయి. . ఇవాళ ఉదయం 11:30కు జపాన్ దేశానికి బయలుదేరిన ఈ బృందం, మొదటి ఔట్‌రీచ్ ట్రిప్‌ను ప్రారంభిస్తోంది.
పాకిస్థాన్ వ్యతిరేకంగా సందేశం
ప్రస్తుతం పాకిస్థాన్ భద్రతా మండలి రొటేటింగ్ మెంబర్‌గా ఉండగా, మరో 17 నెలల పాటు అదే స్థితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన వాదనలను ప్రపంచానికి వినిపించేందుకు ప్రయత్నించనుందని భువనేశ్వర్ ఎంపీ అపరాజితా సరంగి హెచ్చరించారు. అందుకే భారత్ అంతర్జాతీయంగా ముందడుగు వేసి తమ వాదనను నిష్పక్షపాతంగా తెలియజేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. విభిన్న పార్టీలకు చెందిన ఎంపీలు కలిసి ఈ దేశాలకు వెళ్లి భారత దృక్కోణాన్ని అక్కడి ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్ఖాన్ వైఖరిని ఖండించాలని, ఇది మనందరి బాధ్యత అన్నారు అపరాజితా సరంగి,
ఏడు బృందాల సమాచారం
ఈ ఏడూ బృందాలకు నేతృత్వం వహించేవారిలో శశి థరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), సుప్రియా సూలే (ఎన్‌సీపీ), శ్రికాంత్ ఏకనాథ్ శిండే (శివసేన), కనిమొళి (డీఎంకే) ఉన్నారు.