Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Are you applying for a green card but dont make this mistake

Whitehouse: గ్రీన్ కార్డు దరఖాస్తు చేస్తున్నారా..? అయితే ఈ తప్పు అస్సలు చేయొద్దు..!

  • Published By: techteam
  • September 27, 2025 / 07:00 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Are You Applying For A Green Card But Dont Make This Mistake

గ్రీన్ కార్డు దారులకు అప్ డేట్.. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు చిన్న చిన్న పొరపాట్లతో అవకాశాల్ని చేజార్చుకుంటున్నారు. ఇలాంటి వారికి అగ్రరాజ్యం వలస సేవల విభాగం (U.S. Citizenship and Immigration Services) ఓ సూచన లాంటి హెచ్చరిక చేసింది.

Telugu Times Custom Ads

అమెరికాలో శాశ్వత నివాసానికి ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం ఐ-485 దరఖాస్తును పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే అందులోని పార్ట్‌-9లో అడిగిన ప్రశ్నలకు చాలామంది సమాధానాలు ఇవ్వడం లేదని వలసల విభాగం (USCIS) వెల్లడించింది. దానివల్ల దరఖాస్తు తిరస్కరణకు గురికావొచ్చని లేదా ఆ ప్రక్రియ ఆలస్యం కావొచ్చని హెచ్చరించింది. ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం అమెరికా (US Immigration) ఏటా.. 2,26,000 ఫ్యామిలీ ప్రిఫరెన్స్‌, 1,40,000 ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డు (Green Card)లను జారీ చేసేందుకు వీలుంటుంది.

గ్రీన్‌కార్డు (Green Card) పొందే ప్రక్రియలో ఐ-485 దరఖాస్తుకు ఆమోదం లభించడం అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఒక కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రత్యేక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సమయంలో వారంతా యూఎస్‌లోనే ఉండాల్సి ఉంటుంది. అలాగే చట్టపరంగా అమెరికాకు వచ్చామని నిరూపించే పత్రాలు, జనన ధ్రువీకరణపత్రం, వైద్య పరీక్షల రికార్డులు సమర్పించాల్సి ఉంటుంది.

అక్టోబర్ 20 నుంచి గ్రీన్‌కార్డు టెస్టింగ్‌లో మార్పులు..

ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసలకు సంబంధించిన విధానాల్లో మార్పులు చేస్తున్నారు. ఈక్రమంలో గ్రీన్‌కార్డులు పొందాలనుకునేవారిని పరీక్షించే ప్రక్రియలో మార్పులు ఉంటాయని, అక్టోబర్ 20 నుంచి అవి అమల్లోకి వస్తాయని అమెరికా ప్రభుత్వం తాజాగా నోటిఫై చేసింది. కొన్ని అదనపు అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. ‘‘అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించేవారికి మాత్రమే గ్రీన్‌కార్డును కేటాయించాలన్నదే మా విధానం. దానిని నిర్దరించేందుకే ఈ మార్పులు’’ అని యూఎస్‌సీఐఎస్‌ ప్రతినిధి వెల్లడించారు. యూఎస్ చరిత్ర, ప్రభుత్వం గురించి దరఖాస్తుదారుడి అవగాహనను పరీక్షిస్తారు. సరైన నైతిక ప్రవర్తన కలిగిఉన్నారా..? అని టెస్ట్ చేయనున్నారు. మొత్తం 20 ప్రశ్నల్లో 12 వాటికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం.

 

 

 

Tags
  • America
  • Green Card
  • U.S. Citizenship & Immigration Services

Related News

  • Ata Mou With Iit Hyderabad

    ATA: ఐఐటీ హైదరాబాద్‌తో ఆటా చారిత్రక ఒప్పందం

  • Viksit Bharat Run In New Jersey

    Viksit Bharat Run: వికసిత్ భారత్ రన్‌లో భాగస్వాములు కండి!

  • Weekly Free Health Screening Center Under The Auspices Of Mata

    MATA: మాటా ఆధ్వర్యంలో ప్రతివారం ఫ్రీ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్

  • Tta Bathukamma And Dasara Celebrations In Tampa

    TTA: టాంపాలో ఘనంగా టిటిఎ బతుకమ్మ వేడుకలు

  • Sankara Nethralaya 5k Run In Detroit

    Sankara Nethralaya: శంకరనేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది

  • Tta New Jersey Chapter Bathukamma Celebrations

    TTA: టీటీఏ న్యూజెర్సీ చాప్టర్‌ బతుకమ్మ సంబరాలు విజయవంతం

Latest News
  • Whitehouse: అమెరికా-పాక్ వాణిజ్యబంధం.. భారత్ కు ఇబ్బందేనా…?
  • Delhi: పాక్ వైపు అమెరికా, సౌదీ.. మరి భారత్ సంగతేంటి…?
  • Whitehouse: గ్రీన్ కార్డు దరఖాస్తు చేస్తున్నారా..? అయితే ఈ తప్పు అస్సలు చేయొద్దు..!
  • K-Ramp: “K-ర్యాంప్” మూవీ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది – కిరణ్ అబ్బవరం
  • Saraswathi: వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్, దోస డైరీస్ ప్రొడక్షన్ నంబర్ 1 టైటిల్ సరస్వతి
  • Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన
  • MGBS:ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు : సీఎం రేవంత్‌ రెడ్డి
  • NATS New Jersey Adopt-A Highway on Oct 11
  • NATS Missouri Chapter Men’s Volleyball Tournament
  • BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలి : చంద్రబాబు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer