TTA: టీటీఏ 10వ వార్షికోత్సవానికి వీసీ సజ్జనార్‌కు ఆహ్వానం..
TTA: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) తమ ప్రతిష్ఠాత్మక 10వ వార్షికోత్సవ వేడుకలకు (10th Anniversary Celebrations) హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ని సభ్యులు ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి సజ్జనార్ సానుకూలంగా స్పందించారు. టీటీఏ బృందంలోని ముఖ్య సభ్యులు నవీన్ రెడ్డి మల్లిపెద్ది (టీటీఏ ప్రెసిడెంట్), ఎల్ఎన్ రెడ్డి దొంతిరెడ్డి (10వ వార్షికోత్సవ చైర్), ప్రవీణ్ చింత (టీటీఏ డెవలప్మెంట్ డైరెక్టర్), విశ్వ కంది (సేవా డేస్ కోఆర్డినేటర్), జ్యోతి రెడ్డి (అంతర్జాతీయ సేవా డైరెక్టర్), నరసింహ పెరుక (అంతర్జాతీయ వైస్ ప్రెసిడెంట్), రమ వనమ (కల్చరల్ కమిటీ అడ్వైజర్)… వీసీ సజ్జనార్ గారిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. మైలురాయి లాంటి ఈ వేడుకల్లో సజ్జనార్ పాల్గొనడానికి అంగీకరించడం పట్ల టీటీఏ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది. ఆయన రాకతో ఈ 10వ వార్షికోత్సవ వేడుకల ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని టీటీఏ బృందం తెలిపింది.






