Delhi: పాక్ వైపు అమెరికా, సౌదీ.. మరి భారత్ సంగతేంటి…?

ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రపంచ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకూ చైనా (China) అండ చూసుకుని ఎగిరిపడిన పాక్.. ఇప్పుడు అమెరికాకు దగ్గరవుతోంది. దీనిలో భాగంగా పాత మితృత్వాన్ని గుర్తుకు తెస్తోంది. ఓవైపు అమెరికాతో స్నేహబంధాన్ని నెరపుతూనే… మరోవైపు గల్ఫ్ దేశాలకు సన్నిహితమవుతోంది. ఇటీవలే సౌదీతో పాక్ చేసుకున్న పరస్పర రక్షణ బంధం.. ఈదిశగ మొదటి అడుగని చెప్పవచ్చు. దీనిలో భాగంగా పాక్ పై ఏదేశమైన దాడి చేస్తే.. అది సౌదీ అరేబియా (Sauki Arabia) పైనా దాడి చేసినట్లుగా భావించడం జరుగుతుంది. దీంతో ఇరుదేశాలు కలిసి , ఆదేశంపై ఎదురుదాడికి దిగుతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎవరేం అన్నా అగ్రరాజ్యం అనుకున్నదే జరుగుతోంది. వారు ఎవరిపై దాడి చేయాలంటే వారిపై దాడులు చేస్తున్నారు. ఆదేశాల్ని నామరూపం లేకుండా విధ్వంసం సృష్టిస్తున్నారు. ఏదేశం కనీసం ప్రశ్నించేందుకు సాహసించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యం అండ పాకిస్తాన్ కు దక్కింది. ఇక భారత్ కు అనాదిగా మిత్రదేశాలుగా ఉన్న సౌదీ లాంటి దేశాలు.. ఇప్పుడు పాక్ తో దోస్తీ అంటున్నాయి. అంటే ఇప్పుడు ఇరువైపులా భారత్ కు సహకారం ఉండదని చెప్పొచ్చు. దీంతో ఇక పాక్ ఉగ్రమూకల్ని ఎగదోసి.. భారత్ దాడులు చేస్తే, ఎదురు దాడులకు దిగే అవకాశముంది.
ఇక భారత్ కు ఉన్న ఒకే ఒక అండ.. రష్యా.. అయితే రష్యా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అని చెప్పొచ్చు. ఆ దేశ ఆర్థిక రంగాన్ని దెబ్బకొట్టేలా.. చమురు అమ్మకాలపైనా అమెరికా, ఈయూ ఆంక్షలు విధించాయి. ఇలాంటి సమయంలో.. పాక్, చైనా మాత్రం అక్కడ చమురు కొంటూ అండగా నిలుస్తున్నాయి. ఓవేళ పాక్ మనపై దాడికి తెగబడితే.. అప్పుడు రష్యా సహకారం ఎలా ఉంటుందన్నది చెప్పలేం. ఇక మరో దేశం చైనా.. ఎప్పుడూ తన ప్రయోజనాలే చూసుకుంటుంది. ఇక దశాబ్దాల నుంచి భారత్ మిత్రదేశంగా ఉన్న ఇజ్రాయెల్.. అమెరికా అదుపాజ్ఞల్ని దాటి ప్రవర్తించే పరిస్థితి ఉండదు.
అందుకే .. భారత ప్రధాని మోడీ.. ఆత్మనిర్భర్ అంటున్నారు. అంటే ఇక మనదేశమే.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని.. రక్షణపరంగా అబేధ్యంగా నిలవాల్సి ఉంటుంది. యుద్ధ సమయంలో ఏ ఇతర దేశం వైపో ఆయుధాలు, మందుగుండు కావాలని అర్థించే పరిస్థితి ఉండకూడదు. అందుకే భారత దేశం.. ప్రపంచంలో సూపర్ పవర్ గా ఎదగాల్సి ఉంది. అదెలా అంటే ఇప్పుడు అమెరికా ఎలా అయితే ప్రపంచాధిపత్యం వహిస్తుందో.. ఆస్థాయికి భారత్ చేరాలి. దీనికి దశాబ్దాల సమయం పట్టొచ్చు. కానీ భారతీయులు ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా బతకాలంటే మాత్రం ఆరోజు రావాల్సి ఉంటుందని చెప్పక తప్పదు.