GTA: జిటిఎ బతుకమ్మ పోస్టర్ రిలీజ్ వేడుకల్లో ప్రముఖులు

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన (GTA) వాషింగ్టన్ డీసీ వారు సెప్టెంబర్ 28 ఆదివారం రోజున బ్రాడ్ రన్ హైస్కూల్ లో నిర్వహిస్తున్న సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అందులో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు,యూ ట్యూబ్ వీడియోల ద్వారా ప్రజాదరణ పొందిన గంగవ్వ గారు, సినీ నటి అనన్య నాగల్ల గారు, వర్జీనియా రాజకీయ నాయకులు వర్జీనియా రాష్ట్ర కాంగ్రెస్‌మెన్ సుహాస్ సుబ్రమణ్యం, సెనేటర్ కన్నన్ శ్రీనివాసన్, సెనేట్ డెలిగేట్ జె.జె.సింగ్, కామర్స్ సెకరటరీ హవాన్ పాబ్లో తదితరులు ఈ వేడుకల పోస్టర్‌ను విడుదల చేశారు. సుజిత సమన్వయంలో జయ తేలుకుంట్ల, ప్రత్యూష నరపరాజు, మాధురి గట్టుపల్లి, లక్ష్మి బుయ్యాని, సంకీర్త ముక్క, సింధూర పల్రెడ్డి, మీన కలికోట, అనూష గుండ, గీత తోట, స్వరూప సింగిరేసు, చిన్ని తదితరులు ప్రచార కార్యక్రమాలకు సహకరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి వాషింగ్టన్ డీసీ టీం అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ చైర్మన్ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షుడు శ్రవణ్ పాడూరు, వాషింగ్టన్ డీసీ ఏరియా అధ్యక్షుడు రాము ముండ్రాతి, పూర్వ అధ్యక్షుడు తిరుమల్ మునుకుంట్ల, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని, స్టాండింగ్ కమిటి చైర్ శ్రీకాంత్ పొట్టిగారి, ఇంటెర్నేషనల్ కో-ఆర్డినేటర్ నర్సి దోమ, ఉపాధ్యక్షులు కోట్య బానోత్, రఘు పాల్రెడ్డి, అమర్ అతికం, వాషింగ్టన్ డీసీ బతుకమ్మ కోర్ టీం వంశి సింగిరెడ్డి, ప్రముఖ మిమిక్రి కళాకారుడు వికాస్ ఉల్లి, సాయి వికాస్, భాస్కర్ రెడ్డి, గణేష్ ముక్క, వేణు కలికోట, శ్రవంత్ గుండా, శ్రీని జూపల్లి, వెంకట్ దండ, సునీల్ కుడికాల, వరుణ్ కుసుమ, రాఘవేందర్ బుయ్యాని, ప్రేమ్ సాగర్, ప్రవీణ్ ఆలెటి, అమర్ పాశ్య, కౌశిక్ సామ, రఘు జువ్వాడి, వెంకట్ మందడి, రఘు తోట, హరి వేముల, క్రాంతి దూడం, రాజేష్ కాసారనేని, సందీప్ పునరెడ్డి, వెంకటకృష్ణరెడ్డి గుజ్జులా, సామ్ గుజ్జులా, శివరాం, హరీష్ బన్నాయి తదితరులు వేడుకల విజయవంతానికి కృషి చేస్తున్నారు.