India: అమెరికా సంస్థ ఆరోపణలు… దీటుగా బదులిచ్చిన భారత్
భారత నిఘా సంస్థ రా (Indian intelligence agency Raw) పై ఆంక్షలు విధించాలని అమెరికాకు చెందిన ది యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ పేర్కొనడాన్ని భారత్ (India) తీవ్రంగా ఖండిరచింది. అరుదైన సంఘటనలను తప్పుగా చూపించేందుకు ఆ సంస్థ నిరంతర ప్రయత్నాలు చేస్తోదని మండిపడింది. అసహనాన్ని వెల్లగక్కుతూ భారత ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలు ఫలించవంటూ దీటుగా బదులిచ్చింది. యూఎస్సీఐఆర్ఎఫ్ (USCIRF) ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదిక -2025ను చూశాం. రాజకీయ ప్రేరేపిత, పక్షపాత ధోరణిలో మరోసారి తన విశ్లేషణలు చేసింది. అరుదైన సంఘటనలను తప్పుగా చూపుతూ, భారత ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు నిరంతర ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. వీటిని చూస్తుంటే మతస్వేచ్ఛపై ఆ సంస్థకు ఉన్న ఆందోళన కంటే ఉద్దేశపూర్వక అజెండానే ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి యూఎస్సీఐఆర్ఎఫ్పైనే ఆంక్షలు విధించాలి అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) పేర్కొన్నారు.






