ప్రధాని మోదీతో జో బైడెన్ ఫోన్‌కాల్.. ఏం చర్చించుకున్నారంటే ?
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌కాల్‌లో సంభాషించుకున్నారని తాజాగా వైట్‌హౌస్ వెల్లడిరచింది. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అనిశ్చితిపై గతవారం వారిద్దరూ తమ ఆందోళనలను పంచుకున్నారని తెలిపింది. ఆ దేశంలో ప్రజల భద్రత, ప్రజాస్వామ్య సంస్థల భవిష్యత్తు గురించి బైడెన్ తన ఆందోళనను వెలిబుచ్చారని పేర్కొంది. ప్రధాని మోదీ, జో బైడెన్ ఫోన్‌కాల్‌లో మాట్లాడుకున్నారని వైట్‌హౌస్ వెల్లడిరచింది. ఇదివరకు భారత్ కూడా ఈ ఫోన్‌కాల్ గురించి వెల్లడించింది. బంగ్లాల్ మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రత, త్వరగా సాధారణ స్థితిని నెలకొల్పాల్సిన అవసరాన్ని చాటిచెప్పినట్లు తెలిపింది.






