Imran Khan : నోబెల్ శాంతి పురస్కారానికి ఇమ్రాన్‌ఖాన్ పేరు
మానవహక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణకు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ( 72) చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారాని (Nobel Peace prize) కి నామినేట్ చేసినట్లు న్యాయవాదుల సంస్థ ఒకటి వెల్లడిరచింది. నార్వే రాజకీయపార్టీ పార్షియేట్ సెంట్రమ్కు అనుబంధంగా గతేడాది డిసెంబరులో న్యాయవాదుల సంస్థ పాకిస్థాన్ వరల్డ్ అలయన్స్ ( పీడబ్ల్యూఏ) పేరిట ఏర్పాటైంది. పాకిస్థాన్ (Pakistan ) లో మనవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయన పేరును నోబెల్ శాంతి పురస్కారానికి తమ పార్టీ తరపున నామినేట్ చేస్తున్నాం అని పార్షియేట్ సెంట్రమ్ (Parsiate centrum) వెల్లడిరచింది. దక్షిణాసియాలో శాంతి కోసం కృషి చేస్తున్నారంటూ 2019లో కూడా ఇమ్రాన్ పేరు నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యింది. అధికార దుర్వినియోగం, అవినీతి కేసుల్లో 14 ఏళ్ల జైలు శిక్షకు గురైన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం కారాగారంలో ఉన్నారు.






