విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీ
ప్రస్తుతం జాతీయ భద్రత ఉపసలహాదారుగా ఉన్న విక్రమ్ మిస్రీ(59) విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ 1989 బ్యాచ్‌కు చెందిన ఈ సీనియర్ అధికారి చైనా వ్యవహారాల్లో నిష్ణాతుడు. వినయ్ క్వాత్రా స్థానంలో విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి బాధ్యతలను జులై 15న విక్రమ్ మిస్రీ చేపడతారని కేబినెట్ నియామకాల కమిటీ తెలిపింది. విక్రమ్ మిస్రీ గతంలో ముగ్గురు ప్రధాన మంత్రులు (ఐ.కె. గుజ్రాల్, మన్మోహన్సింగ్, నరేంద్ర మోదీ) వద్ద ప్రైవేటు సెక్రెటరీగా సేవలు అందించారు.






