ఇజ్రాయెల్ కు ఎదురుదెబ్బ… తన చేతిలోనే సొంత సైనికుల్ని
గాజాపై దాడుల తీవ్రతను పెంచిన ఇజ్రాయెల్‌కి ఎదురుదెబ్బ తగిలింది. తన ఆర్మీ చేతితోనే సొంత సైనికుల్ని బలిపెట్టుకుంది. ఇజ్రాయెల్ సైన్యం ఉన్న భవనం వైపు యుద్ధ ట్యాంకులు పొరపాటును గుండ్లను పేల్చడంతో ఐదుగురు జవాన్లు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విషాదకర ప్రమాదం గాజాలోని ఉత్తర భాగంలో చోటు చేసుకుంది. హమాస్ దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతి దాడులు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏడు నెలలుగా సాగుతున్న ఈ పోరాటంలో ఇజ్రాయెల్ ఆర్మీ తన సైనికులను కోల్పోవడం ఇదే మొదటిసారి. గతంలోనూ ఐడీఎఫ్ బలగాలు ఇలాంటి పొరపాటే చేశాయి. హమాస్ చెరవలో ఇజ్రాయెల్ బందీలను ముగ్గుర్ని కాల్చి చంపాయి.






