రష్యా ఆర్మీ చీఫ్‌కి అరెస్టు వారెంట్!
ఉక్రెయిన్ యుద్దం నేరాల కింద రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షోయిగీకి, ఆర్మీ చీఫ్ జనరల్ వేలరీ జెరాసిమోవ్కి అంతర్జాతీయ నేరాల విచారణ కోర్టు అరెస్టు వారంట్లను జారీ చేసింది. వీరిద్దరూ యుద్ధ నేరాలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై కోర్టు విచారణ జరిపి వాటికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించింది. ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాల్లో దాడుల సందర్భంగా రష్యన్ సేనలు అమానుషంగా వ్యవహరించాయనీ, అందుకు వీరిద్దరూ బాధ్యులని కోర్టు నిర్థారించింది. దాడులు జనావాస ప్రాంతాలపై ఉద్దేశ్య పూర్వకంగానే వీరు జరిపించినట్టు కోర్టు నిర్ధారించింది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలపైనే తాము దాడులు జరుపుతున్నట్టు రష్యన్ సైనికాధికారులు పదే పదే పేర్కొన్నప్పటికీ, పౌరులపైనే గురిపెట్టి దాడులు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. గత సంవత్సరం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా ఇదే కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది.






