Gujarat : అక్రమంగా అమెరికాకు వెళ్తూ గుజరాత్ వాసి మృతి
భారతీయులు అక్రమంగా ఇతర దేశాలకు వెళ్లడం మానుకోవాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొందరు ప్రమాదకరమైన డంకీ మార్గాల్లో అగ్రదేశానికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా గుజరాత్ (Gujarat) కు చెందిన ఓ వ్యక్తి కుటుంబ సమేతంగా డంకీ దారిలో అమెరికా (America)కు వెళ్తూ మార్గమధ్యంలోనే ప్రాణలు కోల్పోయాడు. మృతుడిని సబర్‌కాంఠా జిల్లా మోయద్ గ్రామానికి చెందిన దిలీప్ పటేల్‌గా గుర్తించారు. దిలీప్ పటేట్ అమెరికాలో స్థిరపడాలనే ఆలోచనతో ఇటీవల ఓ ఏజెంట్‌ను సంప్రదించారు. తన భార్య, చిన్నారితో సహా ముగ్గురిని అమెరికా పంపడానికి రూ.కోటి చెల్లించాలని ఏజెంట్ కోరడంతో తన భూమిని విక్రయించి, ఆ మొత్తం చెల్లించినట్లు స్థానికులు పేర్కొన్నారు. రెండు నెలల క్రితం ఆయన కుటుంబతో సహా పర్యాటక వీసాపై దుబాయ్ (Dubai) వెళ్లి, అక్కడి నుంచి నికరాగ్వాకు వెళ్లారు. మధుమేహ వ్యాధిగ్రస్తుడైన దిలీప్ అక్కడి నుంచి డంకీ మార్గంలో ప్రయాణిస్తూ అనారోగ్యానికి గురై మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. కాగా మృతుడి భార్యాబిడ్డలు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. ఈ సంఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్థానిక పోలీసులు(Police) వెల్లడిరచారు.






