India :భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం
భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని (Trade agreement) కుదుర్చుకున్నాయి. దీంతో భారత్ నుంచి కార్మికులు అధికంగా పనిచేసే తోట వస్తువులు, పాదరక్షలు (Footwear) , దుస్తులు, ప్రాసెస్డ్ ఆహారోత్పత్తుల వంటి ఎగుమతులకు ఊతం లభించనుంది. బ్రిటన్ నుంచి విస్కీ (Whiskey), కార్లు (cars), వైద్య పరికరాల దిగుమతి చౌకగా మారనుంది. తాజా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం 2023 కల్లా 120 బి. డాలర్లకు చేరొచ్చన్న అంచనాలున్నాయి. 2022 జనవరి నుంచి 14 దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇదొక చరిత్రాత్మక మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందాలతో ఇరు దేశాల వాణిజ్యం, పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగ సృష్టి మెరుగవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో మోదీ ఫోన్లో సంభాషించాక, ఈ ఒప్పంద ప్రకటన వెలువడిరది.







