Harish Rao : లండన్‌లో హరీశ్‌రావుకు ఘన స్వాగతం

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(Harish Rao) కు ఎన్నారై బీఆర్‌ఎస్ శ్రేణులు లండన్ (London ) హీత్రౌ ఎయిర్ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని కలుసుకుందామని తెలిపారని ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి (Naveen Reddy) తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హరి గౌడ్ (Hari Gowda) నవాపేట్, రవి రేటినేని, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వయిజరీ బోర్డు చైర్మన్ సీక చంద్ర శేఖర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీకాంత్ జెల్లా, గణేష్ కుప్పాల, రవి పులుసు , సురేష్ బుడగం, ప్రశాంత్ మామిడాల, అంజన్ రావు (Anjan Rao), అబ్దుల్, పవన్ గౌడ్, తరుణ్ లునావత్ హాజరయ్యారు.