Australia : విద్యార్థి వీసా నిబంధనలు కఠినతరం : ఆస్ట్రేలియా
వివిధ దేశాల్లో విదేశీ విద్యార్థులకు నిర్దేశించిన నిబంధనల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఆయా దేశాల్లో వివిధ విశ్వవిద్యాలయాల క్యాంపస్లను ఎంపికను ఈ మార్పులు ప్రభావితం చేస్తాయి. ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా (Australia)ను ఎంపిక చేసుకొనే భరతీయ విద్యార్థుల (Indian students) సంఖ్య భారీగా పెరిగింది. 2004లో 1,18,109 మంది విద్యార్థులు ఆస్ట్రేలియా లోని పలు విశ్వవిద్యాలయాల (Universities)ను ఎంపిక చేసుకొన్నారు. తమ విద్యార్థి వీసా (Student visa) నిబంధనల్లో పేర్కొనదగ్గ మార్పులను చేయనున్నట్లు గత ఏడాది ఆస్ట్రేలియా ప్రకటించింది. ఇప్పటి వరకు ఆ దేశానికి వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి లేదు. తాజాగా పరిమితి విధించాలని నిర్ణయించినట్లు సమాచారం. వివిధ దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్యను 2.70 లక్షలకు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటన లేనప్పటికీ ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల సమయానికి ఆ ప్రకటన ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.






